NC24: చైతూ సినిమాపై బజ్ పెంచిన నాగవంశీ
విరూపాక్ష(Virupaksha) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన కార్తీక్ దండు(Karthik Dandu) మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మిస్టిక్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా తర్వాత ఇప్పుడు కార్తీక్ తన రెండో సినిమాను అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య(Naga Chaitanya)తో చేస్తున్నాడు. ఈ సినిమా చైతూ(Chaithu) కెరీర్లో 24వ సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా షూటింగ్ కనీసం 10% కూడా పూర్తవకుండానే ఈ మూవీకి సంబంధించిన అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ అమ్ముడపోయినట్టు తెలుస్తోంది. NC24 మూవీ థియేటర్ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా సితార(sithara) సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నాగ వంశీ(Naga Vamsi) నిర్మాతలకు భారీగానే కోట్ చేసినట్టు తెలుస్తోంది. వంశీ ఈ డీల్ ను రూ.30 – రూ. 40 కోట్ల మధ్యలో క్లోజ్ చేశాడని టాక్ వినిపిస్తోంది.
ఇంత భారీ మొత్తంలో డీల్ అంటే నిర్మాతలకు ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డీల్ క్లోజ్ అయిందంటే నిర్మాతకు నాగవంశీ ఎంత కాదన్నా సగం డబ్బైనా ఇవ్వాలి. సినిమా పూర్తవడానికి ఎంతలేదన్నా 9 నెలలు ఈజీగా పడుతుంది. అంటే ఈ లోపు వడ్డీలు కూడా తోడవుతాయి కాబట్టి నిర్మాతలకు ఈ డీల్ చాలా బెటర్. పైగా ఈ డీల్ తో సినిమాపై బజ్ కూడా విపరీతంగా పెరిగే ఛాన్సుంది. కనీసం సగం సినిమా కూడా పూర్తవకుండానే ఇలా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం ఈ సినిమాకు ముందు ముందు కూడా బాగానే కలిసొచ్చే ఛాన్సుంది.






