Daku Maharaj: వాల్తేరు వీరయ్య కంటే డాకు మహారాజ్ బావుంటుంది: నాగవంశీ
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మధ్య సినిమాల పోటీ ఎప్పటినుంచో నడుస్తూ వస్తుంది. వీరిద్దరూ బాగానే ఉన్నా వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం ఓ రేంజ్ లో గొడవలుంటాయి. ఎవరైనా డైరెక్టర్ వీరిలో ఒకరితో సినిమా చేసి హిట్ అందుకుంటే, అదే డైరెక్టర్ తమ హీరోతో సినిమా తీస్తే ఇంకా పెద్ద హిట్ అవాలని ఫ్యాన్స్ కోరుకుంటారు.
ఇప్పుడు డైరెక్టర్ బాబీ(Bobby)కి అదే పరీక్ష ఎదురవుతుంది. చిరంజీవితో బాబీ తీసిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాక అతని ఖాతాలో ఉన్న పెద్ద హిట్ అదే. ఇప్పుడు అదే బాబీ బాలయ్య(Balayya)తో డాకు మహారాజ్(Daku Maharaj) తీశాడు. గతేడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రిలీజవుతుంటే రానున్న సంక్రాంతికి డాకు మహారాజ్ రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ వాల్తేరు వీరయ్య కంటే సూపర్ హిట్ అవాలని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ(Naga vamsi) ఈ సినిమా గురించి కామెంట్ చేశాడు. చిరంజీవి ఫ్యాన్స్ తనను తిట్టుకున్నా సరే వాల్తేరు వీరయ్య కంటే బాబీ డాకు మహారాజ్ సినిమాను చాలా బాగా తీశాడని, కథ, విజువల్స్, టేకింగ్ అన్నీ చూసి ఈ మాట చెప్తున్నానటి, థియేటర్లో సినిమా చూశాక అందరికీ ఇదే ఫీలింగ్ కలుగుతుందని ఆయన వెల్లడించాడు. వంశీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.













