విశాల్ కు కౌంటర్ ఇచ్చిన ప్రొడ్యూసర్
మార్క్ ఆంటోనీతో చాలా కాలం తర్వాత సక్సెస్ను అందుకున్న కోలీవుడ్ హీరో విశాల్, ప్రస్తుతం ఆ సక్సెస్ను ఎంజాయ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. గత మూడేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు ఆ సక్సెస్ దక్కలేదు. అందులో చాలా సినిమాలు సొంత బ్యానర్లోనే చేయడం వల్ల నష్టపోవాల్సి వచ్చింది కూడా. అయినా సరే విశాల్ వెనుకడుగు వేయలేదు.
తన బ్యానర్లోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. తాజాగా మార్క్ ఆంటోనీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఎలాగూ మంచి టాక్ వచ్చింది కాబట్టి దాన్ని ఆడియన్స్ కు చేరేలా సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నాడు విశాల్. ఇదిలా ఉంటే విశాల్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నిర్మాతలు కావాలని కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లు మూడు నాలుగు కోట్లు పట్టుకుని సినిమాలు తీయడానికి రావొద్దని విశాల్ అన్నాడు.
అలా వస్తే ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టమని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై ప్రొడ్యూసర్ కార్తీక్ వెంకట్రామన్ విశాల్ కు కౌంటర్ ఇచ్చాడు. విశాల్ వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఇంత బడ్జెట్ లోనే సినిమా తీయాలని రూలేమీ లేదు. ఒక సినిమాను కోటి రూపాయలతో తీయొచ్చు, రూ.100 కోట్లతో తీయొచ్చు. అందులో వచ్చిన ప్రాఫిట్స్ ను మళ్లీ పెట్టుబడిగా పెట్టే ఛాన్సుంది. ఇలా విశాల్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.













