రిలీజ్ కు ముందే కాస్ట్లీ కారును కొట్టేసిన డైరెక్టర్
సినిమా రిలీజై సక్సెస్ అయ్యాక ఆ హ్యాపీనెస్లో ప్రొడ్యూసర్లు.. డైరెక్టర్లకు, హీరోలకు కార్లను గిఫ్ట్ ఇవ్వడం చాలా మామూలే. జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా నిర్మాత కళానిధి మారన్ హీరోకు, డైరెక్టర్‌కు, మ్యూజిక్ డైరెక్టర్ కు కూడా లగ్జరీ కార్లు గిఫ్ట్ చేశాడు.
అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ కు ముందే 5 కోట్ల కారును గిఫ్ట్ గా అందుకున్నాడు ఓ డైరెక్టర్. అర్జున్ రెడ్డితో రికార్డ్స్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతకు భారీ లాభాలను అందించిందట. సినిమాకు మంచి టాక్ వస్తే ఆ లాభాలు మరింత పెరుగుతాయి. సందీప్ వల్లే ఇదంతా సాధ్యపడిందని, సినిమా మీద ఉన్న నమ్మకంతో ముందే అతడికి ఓ లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడట నిర్మాత. అంతే కాదు ఆ కారు ఖరీదు అక్షరాలా రూ.5 కోట్లు. ఇంత కాస్ల్టీ కారును ఇప్పటివరకు ఏ డైరెక్టరూ గిఫ్ట్ రూపంలో అందుకుని ఉండడు. అది కూడా రిలీజ్ కు ముందు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి మరి.













