Dhanush: హీరో ధనుష్ పై నిర్మాణ సంస్థ సంచలన ఆరోపణలు
ధనుష్(Dhanush) ఓ వైపు డైరెక్టర్ గా మరోవైపు హీరోగా ఇంకోవైపు నిర్మాతగా చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడై(Idly Kadai) సినిమా చేస్తున్న ధనుష్ ఆ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేశాడు కానీ ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నందున ఇడ్లీ కడైను వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాత ఆకాష్(Aakash) తెలిపాడు.
దీంతో పాటూ ధనుష్, శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో కుబేర(Kubera) సినిమాను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీటితో పాటూ ధనుష్ ఆనంద్ ఎల్. రాయ్(Anand L. Roy) దర్శకత్వంలో బాలీవుడ్ లో తేరే ఇష్క్ మైన్(Tere Ishq Mein) సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఫైవ్ స్టార్ట్స్ ఎంటర్టైన్మెంట్స్(Five stars Entertainments) సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం ధనుష్ గతేడాది సెప్టెంబర్ 6న రెమ్యూనరేషన్ తీసుకున్నారని, కానీ ఇప్పటివరకు తమకు డేట్స్ ఇవ్వలేదని, ఈ కారణంతో తామెంతో బాధపడుతున్నామని ఫైవ్ స్టార్స్ వాటాదారులు కలై సెల్వి(Kalai Selvi) ఓ లెటర్ ను రిలీజ్ చేస్తూ ధనుష్ పై ఆరోపణలు చేశారు. ఇడ్లీకడై షూటింగ్ కోసం తమకు డేట్స్ ఇవ్వలేదని, ఆ సినిమా అక్టోబర్ 30 నాటికి పూర్తి చేసి తమకు డేట్స్ ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటికీ ఈ విషయంలో తమకు న్యాయం జరగలేదని కలై సెల్వి తెలిపారు. వడ్డీకి డబ్బు తెచ్చి సినిమాలు నిర్మించే తమ బాధ మీకెప్పుడు తెలుస్తుందని, ఈ విషయంలో తమకు న్యాయం చేకూర్చే సంఘాలే లేవా, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా తమకు వీలైనంత త్వరగా న్యాయం చేకూర్చమని ధనుష్ పై ఆరోపణలు చేస్తూ ఓ పోస్ట్ చేసింది ఫైవ్ స్టార్స్ ఎంటర్టైన్మెంట్. మరి ఈ విషయంలో ధనుష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.













