M4M (మోటివ్ ఫర్ మర్డర్) టీజర్ రిలీజ్.. ఐదు భాషలలో విడుదల కానున్న చిత్రం
టాలీవుడ్లో ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రేక్షకుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు థియేటర్, ఓటీటీలో లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని అమెరికాకు చెందిన దర్శక నిర్బాత మోహన్ వడ్లపట్ల M4M (మోటివ్ ఫర్ మర్డర్) అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రైమ్ హెల్త్ కేర్ అధినేత డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి అమెరికాలో లాంచ్ చేశారు. టీజర్‌తో చిత్రంపై అందరిలోనూ అంచనాలను అమాంతం పెంచేశారు.
సంబీత్ ఆచార్య, జో శర్మ జంటగా నటించిన టీజర్‌ను గమనిస్తుంటే హై స్టాండర్డ్ విజువల్స్‌తో, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. కాలీఫొర్నియా ఫ్రీమాంట్‌లో ఉన్న సినీలాంజ్ సినిమాస్ వెండితెరపై ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ టీజర్‌ను విడుదల చేసి అభినందించారు.
డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి కూడా ఈ చిత్రం బాగా ఆడాలని, ఈ సినిమా టీమ్‌కు మంచి భవిష్యత్తు ఉందని అభినందించారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉందని, ప్రేక్షకులకు రీచ్ అవుతుందని చిత్రయూనిట్‌ని అభినందించారు.
ఇక ఈ టీజర్లో సంబీత్ యాక్షన్, జో శర్మ గ్లామర్ ప్లస్ యాక్టింగ్ హైలెట్ అవుతోంది. వీరిద్దరి పర్ఫామెన్స్, సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయని, జో శర్మ యాక్షన్ మరింత అట్రాక్షన్‌గా నిలవనున్నట్టు టీజర్ చెబుతోంది. M4M చిత్రాన్ని మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై అమెరికన్ కంపెని మెక్విన్ గ్రూప్‌తో కలిసి నిర్మించింది. త్వరలోనే ఈ చిత్రం తెలుగు, హింది, తమిళ్, కన్నడ, మలయాళం ఐదు భాషలలొ విడుదలకు సిద్ధం కానుంది.













