డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పిన దిల్ రాజు
నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం మొదలుపెట్టి, టాలీవుడ్లోనే నెం.1 ప్రొడ్యూసర్‌గా ఎదిగాడు దిల్ రాజు. ఈ ఏడాదిలో వారిసు, బలగం లాంటి సక్సెస్‌లతో పాటూ డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వరుస సక్సెస్‌లు అందుకున్న రాజు, పరిశ్రమలో నిర్మాతగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. దిల్ రాజు ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటిసారి ట్విట్టర్లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇచ్చాడు దిల్ రాజు. ఇందులో భాగంగానే తన కలల ప్రాజెక్టు గురించి అడిగిన ప్రశ్నకు దిల్ రాజు చెప్పిన ఆన్సర్ ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తుంది. జటాయు పేరుతో ఓ మెగా మూవీ తీయబోతున్నట్లు, అందులో టాప్ టెక్నీషియన్లు, స్టార్ కాస్ట్ పని చేస్తారని దిల్ రాజు తెలిపాడు.
ఇంకో ప్రశ్నకు సమాధానంగా ఇప్పటి వరకు తాను తీసిన సినిమాల్లో 70% సక్సెస్ అయ్యాయని, ఫ్యూచర్లో సక్సెస్ పర్సంటేజ్ ఇంకా పెంచాలని చూస్తున్నట్లు ఆయన తెలిపాడు. చిరంజీవి, రవితేజలతో ఎప్పుడు సినిమా అని అడగ్గా, పూనకాలు లోడింగ్ అని, వారితో వేరు వేరుగా త్వరలోనే సినిమాలు ఉంటాయని దిల్ రాజు వెల్లడించాడు.
ఇవి కాకుండా మహేష్ తో ఓ స్పెషల్ మూవీ తీసే ప్రయత్నంలో ఉన్నట్లు, తమిళంలో మరో సినిమాలు సన్నాహాలు చేస్తున్నట్లు, విజయ్‌తో మరో మూవీ కూడా ఉండే అవకాశాలున్నట్లు, పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు, దీంతో పాటూ, సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా ఓ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు.













