Sandigdham: ‘సందిగ్ధం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. నిర్మాత అశోక్ కుమార్
 
                                    సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్ మీద సంధ్య తిరువీధుల నిర్మాతగా పార్ద సారథి కొమ్మోజు తెరకెక్కించిన చిత్రం ‘సందిగ్ధం’. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల, నవీన్ రాజ్, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ క్రమంలో ‘సందిగ్ధం’ (Sandigdham) టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ శుక్రవారం నాడు రిలీజ్ చేశారు.
‘సందిగ్ధం’ టీజర్ గమనిస్తే.. ఓ ఊరు, అందులో జరిగే వింత ఘటనలు, ప్రేమ కథ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా కనిపిస్తున్నాయి. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌కి సరిపోయే మంచి ఆర్ఆర్ కూడా ఉంది. టీజర్‌తో సినిమా మీద మంచి బజ్‌ను అయితే క్రియేట్ చేశారు. టీజర్ లాంఛ్ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో..
నటుడు, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ .. ‘ప్రస్తుతం ఓ సినిమా సక్సెస్ అవ్వడం చాలా కష్టంగా మారింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా పెరిగింది. పది, పదిహేను కోట్లు లేకపోతే సినిమా తీయలేకపోతోన్నారు. కరోనా తరువాత పరిస్థితులు మారిపోయాయి. మూవీకి మంచి టాక్ వస్తే జనాలు థియేటర్లకు వస్తున్నారు. జనాలకి రీచ్ అయ్యేలా సినిమాని ప్రమోట్ చేయాలి. ‘సందిగ్ధం’ టీజర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. భార్యభర్తలైన సంధ్య, పార్దు కష్టపడి తీసిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
హీరో నిహాల్ మాట్లాడుతూ .. ‘పార్ద సారథి గారు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఆయన వల్లే నేను ఈ మూవీలోకి వచ్చాను. పార్దు గారు, సంధ్య గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు. ‘సందిగ్ధం’ మూవీని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరో అర్జున్ దేవ్ మాట్లాడుతూ .. ‘పార్దు గారు, సంధ్య గారు ‘సందిగ్ధం’ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. మా కోసం వచ్చిన అశోక్ కుమార్ గారికి థాంక్స్. సినిమాను చూసి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు పార్ద సారథి మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ విషయంలో ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి కథ ఇంత వరకు రాలేదని చెప్పొచ్చు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఈ ప్రయాణంలో నాకు వెన్నంటే ఉండి నా భార్య సంధ్య తోడుగా నిలిచారు. నన్ను దర్శకుడిగా చేయాలని ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కొత్త వాళ్లను మీడియా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రియా దేశ్ పాగ్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’లో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సంగీత దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ .. ‘పార్దు గారు నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. పట్టుదలతో సొంత బ్యానర్లో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు నవీన్ రాజు మాట్లాడుతూ .. ‘నాకు పార్దు గారితో చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. పార్దు గారి ఫ్యామిలీ ఎంతో కష్టపడి ఈ మూవీని నిర్మించింది. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. ‘సందిగ్ధం’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నరసింహా రాజు మాట్లాడుతూ .. ‘ఇండస్ట్రీలోకి కొత్త వాళ్లు రావాలని అందరూ కోరుకుంటారు. మా చెల్లి నిర్మాతగా, మా బావ దర్శకుడిగా ఈ ‘సందిగ్దం’ మూవీ వచ్చింది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.











 
                                                     
                                                        