నిర్మాత కె. అనిల్ ఇక లేరు
తెలుగు సినీ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ (53) కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నితిన్ కథానాయకుడిగా నటించిన అల్లరి బుల్లోడు, శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన ఒట్టేసి చెబుతున్నా, రాధాగోపాలం చిత్రాల్ని నిర్మించారు అనిల్ కుమార్. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వస్థలం విజయవాడ. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో నివాసం ఉండేవారు. అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న అనిల్ మరణంతో తెలుగు చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది.













