డాక్టర్ అవతారమెత్తిన ప్రియాంక
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ ఒకట్రెండు నెలల్లో తిరిగి తను కమిట్ అయిన సినిమాల షూటింగుల్లో పాల్గొని పూర్తి చేయాలని భావిస్తున్నాడట. రీసెంట్ గా నిర్మాతలు పవన్ ను కలిసి ఈ విషయమై డిస్కస్ చేశారని సమాచారం.
పవన్ చేస్తున్న సినిమాల్లో సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజి ఒకటి. ఈ సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాని రీసెంట్ గా సుజిత్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆమె ఈ సినిమాలో అలకనంద పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాలో ప్రియాంక రోల్ గురించి ఇంట్రెస్టింగ్ ప్రచారం జరగుతుంది. ఓజిలో ప్రియాంక్ డాక్టర్ అలకనంద పాత్రలో కనిపించనుందని, సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కూడా తెలుస్తోంది. మొత్తానికి ప్రియాంక, పవన్ కోసం డాక్టర్ అవతారమెత్తిందన్నమాట.













