తెలుగమ్మాయిలకు సరైన అవకాశాలు లేవు
టాక్సీవాలా చిత్రంలో యంగ్ స్టార్ విజయ్ దేవరకొండకు జోడీగా నటించి అలరించిన భామ ప్రియాంక జవాల్కర్. ఈ తెలుగు అమ్మాయి తన తొలి చిత్రంలోనే క్రేజీ స్టార్‌తో కలిసి నటిచింది. ఆ తర్వాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే తనకు అవకాశాలు రాకపోవటానికి కారణం తెలుగు అమ్మాయిని కావటమే అయి ఉంటుందని ప్రియాంక పేర్కొంది. అదే ముంబయ్ నుంచి వచ్చి ఉంటే మరిన్ని అవకాశాలువచ్చి ఉండేవని చెప్పటం గమనార్హం. తెలుగమ్మాయిలకు సరైన గుర్తింపు లేదని చెప్పింది ఈ భామ. ఉత్తరాది భామలతో పొలిస్తే తెలుగమ్మాయిలకు సరైన అవకాశాలు రావడం లేదన్నది నిజమని చెప్పేసింది. తనలో లోపం ఎక్కడ ఉందో అర్థం కావట్లేదని చెప్పింది ప్రియాకం జువాల్కర్.













