Mad Square: మ్యాడ్ స్వ్కేర్ లో సర్ప్రైజ్ హీరోయిన్
వచ్చే వారం తెలుగులో రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవి నితిన్(Nithin) హీరోగా వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్హుడ్(Robinhood) మరియు నార్నే నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), రామ్ నితిన్(Ram Nithin) ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన మ్యాడ్ స్వ్కేర్(Mad Square) సినిమాలు. రాబిన్హుడ్ మార్చి 27న రిలీజ్ కానుండగా, మార్చి 28న మ్యాడ్ స్వ్కేర్ రిలీజవుతోంది.
రెండు సినిమాలు ప్రమోషన్స్ జోరుని పెంచేశాయి. అప్పటివరకు సోసో గా ఉన్న రాబిన్హుడ్ అదిదా సర్ప్రైజు(Adhidha SurpriseU) అనే సాంగ్ రిలీజయ్యాక ఒకడుగు ముందంజలో ఉంది. అప్పటివరకు చేసిన ప్రమోషన్స్ అన్నీ ఒకెత్తయితే ఆ సాంగ్ వచ్చాక జరుగుతున్న ప్రమోషన్స్ ఒకెత్తు. ఎక్కడ విన్నా ఆ సాంగే. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆ సాంగ్ పై వందలాది రీల్స్ కూడా వచ్చాయి.
అయితే మ్యాడ్ స్వ్కేర్ కు ఆల్రెడీ మంచి హైపే ఉంది. మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో సినిమాకు కావాల్సినంత బజ్ ముందే దక్కింది. అయితే రాబిన్హుడ్ లానే ఈ సినిమాలో కూడా ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందట. అదే స్పెషల్ సాంగ్. టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) ఈ సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో కనిపించడంతో పాటూ స్పెషల్ సాంగ్ చేసిందని తెలుస్తోంది. కావాలనే ప్రియాంక సాంగ్ ను మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేయలేదని అంటున్నారు. ట్రైలర్ కు కాస్త ముందుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేసి ఒక్కసారిగా సినిమాపై హైప్ ను పెంచాలని చూస్తున్నారట. మరి రాబిన్హుడ్ సాంగ్ లానే ఈ సాంగ్ కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తుందేమో చూడాలి.













