ఎట్టకేలకు బోణీ కొట్టిన ప్రియాంక
ప్రియాంక మోహన్ కు తెలుగులో అవకాశాలొస్తున్నా సినిమాలు చేయడంలో మాత్రం నెమ్మదిస్తుంది. ఇప్పటివరకు అమ్మడు నుంచి వచ్చింది మూడే సినిమాలు. అందులో మొదటి సినిమా గ్యాంగ్ లీడర్ అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది. తర్వాత శర్వానంద్ తో తీసిన శ్రీకారం సినిమా కూడా నిరాశ పరిచింది.
మధ్యలో శివ కార్తికేయన్ తో చేసిన డాన్, వరుణ్ డాక్టర్ సినిమాలు హిట్ అయ్యాయి కానీ అవి స్ట్రయిట్ తెలుగు సినిమాలు కాదు. దీంతో ప్రియాంకకు తెలుగులో ఇప్పటివరకు సక్సెస్ రాలేదనే లోటు అలాగే ఉండిపోయింది. ఇప్పుడా లోటును సరిపోదా శనివారం సినిమా తీర్చేసింది. ఈ సినిమా సక్సెస్ దిశగా అడుగులేస్తుంది.
సినిమాలో అమ్మడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యమే ఉన్నప్పటికీ ఎక్కడా గ్లామర్ షో చేయకుండా మ్యాగ్జిమం పోలీస్ డ్రెస్ లోనే కనిపించింది. నిజానికి ప్రియాంకకు అవకాశాలు ఎక్కువ రాకపోవడానికి కారణం తను ఎక్స్పోజింగ్ చేయకపోవడమే. అందుకే తమిళంలో సూర్యతో నటించినప్పటికీ ఛాన్సులు మాత్రం రాలేదు. ప్రస్తుతం ప్రియాంక చేతిలో జయం రవి బ్రదర్ సినిమాతో పాటూ పవన్ కళ్యాణ్ ఓజి ఉంది. ఓజి సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఓజి బ్లాక్ బస్టర్ అయితే అమ్మడికి టాలీవుడ్ నుంచి వరుస ఛాన్సులొచ్చే అవకాశముంది.













