Priyanka Chopra: ఆ ఇండియన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా !

మహేష్ బాబు(mahesh babu) హీరోగా రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ29(SSMB29). ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానో ఇండియన్ సినిమాలో నటిస్తున్నానని, ఆ సినిమా కోసం తానెంతగానో ఎగ్జైటింగ్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది.
నిక్ జోనాస్(nick jonas) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా, పెళ్లి తర్వాత హాలీవుడ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లాక తాను ఇండియాను, హిందీ సినిమాలను మిస్ అవుతున్నానని, ఈ ఏడాది ఒక ఇండియన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నానని, ఆ మూవీ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నానని ప్రియాంక వెల్లడించింది. దీంతో ప్రియాంక చోప్రా చెప్పిన సినిమా ఎస్ఎస్ఎంబీ29 గురించేనని మహేష్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.
ఇక ఎస్ఎస్ఎంబీ29 సినిమా విషయానికొస్తే రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ డ్రామాగా రూపొందనుంది. ఈ మూవీ లో మహేష్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఎస్ఎస్ఎంబీ29లో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithvi Raj Sukumaran) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.