అమెరికన్ ఐడల్ ఎవరో తెలుసా?
ఐడల్ అంటే ఆరాధించే విషయం వచ్చేసరికి దేవుడికి ప్రతిరూపం అని చెబుతారు. ఓ ఐకాన్, అమితంగా ప్రేమించడం వంటి అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి చర్చకు ఎందుకొచ్చిందంటే మన ఇండియన్ నటి అమెరికన్ ఐడల్గా మారారు. అక్కడ ప్రజలకు ఓ ఐకాన్ అయ్యారు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఇలా ప్రజల ఆరాధిస్తున్న వారి జాబితాలో అక్కడ ఇప్పటి వరకు హాలీవుడ్ నటుడు ద్వానే జాన్సన్ మొదటి స్థానంలో ఉండేవారు. ఈయనే ఇప్పటి వరకూ అమెరికన్ ఐడల్. ఈయనను అధిగమించి ఆ స్థానాన్ని ప్రియాంక చోప్రా దక్కించుకున్నారు. హాలీవుడ్ రిపోర్టర్స్ సోషల్ క్లింబర్స్ ఈ జాబితాను విడుదల చేసింది.
సాధారణంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్ ప్లస్ వంటి వాటిల్లో ఈ సెలబ్రిటీలకు లభిస్తున్న అనుసరగణం ఆధారంగా ఈ జాబితాను తయారు చేస్తారు. ఎంవీపీనెక్స్ అనే కంపెనీ వీటిని విశ్లేషిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ప్రియాంక చోప్రాకు 53.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక తన విజయాలను, జీవిత విశేషాలను, నిరంతరం చేస్తున్న పనులను నిత్యం తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈమె హాలీవుడ్ చాలా ప్రాజెక్టులు కూడా చేశారు. అందులో క్యాంటికో సిరిస్ మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.













