ఠాగూర్ ప్రేమకథ తీయనున్న ప్రియాంకచోప్రా
బాలీవుడ్లోనే కాదు…హాలీవుడ్లో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ప్రియాంకచోప్రా నిర్మాతగా కూడా సక్సెస్‌ను అందుకుంటోంది. పంజాబీలో సర్వాన్ మరాఠీలో వెంటిలేటర్ భోజ్‌పురిలో భమ్ భమ్ బోలో రహా హై కాశీ అనే సినిమాలు తీశారు. వీటిలో వెంటిలేటర్ కు మూడు జాతీయ అవార్డులు దక్కాయి. జాతీయ గీతం జన గణ మన అధినాయక జయహే రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం ఆధారంగా ఓ సినిమా నిర్మించేందుకు ప్రియాంక చోప్రా సన్నాహాలు చేస్తున్నారు. ఉజ్వల ఛటర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత బెంగాలీ, మరాఠీలో నిర్మించి తరువాత హిందీలో డబ్ చేయనున్నారని సమాచారం.













