మా ఆనంద్ శీల పాత్రలో ప్రియాంకచోప్రా
వెండితెరపై తన విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా. వివాదాస్పద ఆధ్యాత్మిక సలహాదారు మా ఆనంద్ శీల జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనున్నది. భగవన్ శ్రీ రజనీష్‌కు 1981-85 వరకు పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన శీల పేరు 1984లో అమెరికాలో జరిగిన బయో టెర్రర్ అటాక్‌తో ప్రాచుర్యంలోకి వచ్చింది. అమెరికాలో అతిపెద్ద బయోటెర్రరిస్ట్ అటాక్ పేరొందిన ఈ ఘటనలో 751 మది అస్వస్థతకు లోనయ్యారు. ఈ కేసులో 39 నెలలు జైలులో గడిపిన శీల ఆ తర్వాత ఆమెరికా నుంచి స్విట్జర్లాండ్‌కు పారిపోయింది. నేరాలమయంగా సాగిన ఆమె జీవితాన్ని శీల పేరుతో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. శీల పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నది. బారీ లెవిన్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ప్రియాంకచోప్రా ఓ నిర్మాతగా వ్యవహరించనున్నది. ఆంగ్లంతో పాటు హిందీలో ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమచారం. తన కెరీర్లో విభిన్న కోణాలున్న పాత్రగా నిలిచిపోతుందని ప్రియాంకచోప్రా చెప్పింది.













