ప్రియాంక చోప్రా విరాళం రూ. 76 లక్షలు
కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ కష్టకాలంలో చిత్రసీమలోనూ, భద్రతా దళాల్లో పనిచేస్తున్న మహిళలకు అండగా నిలబడేందుకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ముందుకొచ్చింది. తన వంతు ఈ రెండు విభాగాల్లో పని చేస్తున్న వారికి రూ.76 లక్షలు (లక్ష అమెరికన్ డాలర్లు) విరాళం ఇస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఈ కష్టకాలంలో అడ్డంకులను అధిగమించి పోరాడుతున్న మహిళలకు మేం రూ.76 లక్షలు (లక్ష అమెరికన్ డాలర్లు) విరాళంగా ఇస్తున్నాం. ఈ సమయంలో మీరూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొని నిలబడ్డ వారితై మీ కథలను మాతో పంచుకోండి. వాళ్లు చిత్రసీమ, చిన్న, పెద్ద వ్యాపారాలు చేసేవాళ్లు, అందరికీ స్వాగతం పలికే స్థానాల్లోనూ ఉండేవాళ్లు అయి ఉండాలి అని పేర్కొంది ప్రియాంక చోప్రా.













