ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా మరో ఘనత సాధించింది. ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాల కోసం నామినేషన్లను ప్రకటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. హాలీవుడ్ తారలు రోసారియో డాసన్, మిషెల్ రొడ్రిగజ్, రెబెల్ విల్సన్లతో కలసి ప్రియాంక నామినేషన్లను ప్రకటించనుంది. ఈ విషయాఇ్న ఆస్కార్ ఆకాడెమీ ఇన్స్టాగ్రామ్ పేజీలో అధికారికంగా ప్రకటించింది. గతేడాది ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్‌పై నడిచి అలరించింది ప్రియాంక. ఇప్పుడు ఈ అవకాశం ఆమెకు దక్కడం హాలీవుడ్లో ఆమె హవాకు నిరద్శంగా నిలిచింది. జిమ్మీ కెమ్మెల్ ప్రయోక్తగా 90వ ఆస్కార్ వేడుక మార్చి 4న జరగనుంది. ప్రస్తుతం ప్రియాంక క్యాంటికో టీవీ సిరీస్‌తో పాటు మరో రెండు హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.













