న్యూయార్క్ వీధుల్లో ప్రియాంక సందడి
బాలీవుడ్లో పలు హిట్ చిత్రాల్లో నటించి ఆ తర్వాత హాలీవుడ్‌కు పయనమైంది ప్రియాంక చోప్రా. ఈ భామ ప్రస్తుతం అమెరికాలోని టెలివిజన్ సిరీస్ క్యాంటికో 2తో బిజీగా ఉంది. ప్రియాంక కాంటికో ప్రమోషన్స్‌లో భాగంగా న్యూయార్క్ వీధుల్లో సందడి చేసింది. న్యూయార్క్ సిటీలో రెడ్ కలర్ కాస్ట్స్యూమ్స్తో మెస్మరైజ్ చేసింది. అలెజాండ్రా అలొన్సో రోజాస్ డిజైన్ చేసిన రెడ్ జాకెట్, లెగిన్స్ను కవర్ చేస్తూ ఉన్న రెడ్ కోటు, చేతిలో చిన్న హ్యాండ్‌బ్యాగ్‌తో తళుక్కున మెరిసింది బేవాచ్ బ్యూటీ. స్టన్నింగ్ కాస్టూమ్స్‌తో న్యూయార్క్ వీధుల్లో సందడి చేసిన ప్రియాంక ఫొటోలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి.













