ప్రియాంక ఎంగేజ్మెంట్ రింగ్ ధర ఎంతో తెలుసా?
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి హాలీవుడ్‌లోనూ సత్తా చాటి గ్లోబర్ స్టార్‌గా ఎదిగింది ప్రియాంక చోప్రా. తన కంటే పదకొండేళ్లు చిన్నవాడు, హాలీవుడ్ గాయకుడు అయిన నిక్ జోనాస్‌తో ప్రియాంక ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ విషయంపై మౌనంగా ఉన్న ప్రియాంక తాజాగా స్పందించింది. నిక్‌తో తనకు అమెరికాలో ఎంగేజ్మెంట్ జరిగిందని, త్వరలోనే తామిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నామని చెప్పేసింది. బాలీవుడ్ ప్రముఖ ఫ్యాష్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీకి ప్రియాంక హాజరైంది. తన ఎంగేజ్మెంట్ రింగ్‌తో ఆ పార్టీలో ప్రియాంక ఫోటోలకు ఫోజులిచ్చింది. నాలుగు క్యారెట్ల వజ్రాలున్న ఆ ఉంగరం విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలని సమాచారం. ఈ ఉంగరం కొనడం కోసం నిక్ చాలా కష్టపడ్డాడట. లండన్‌లోని టిఫనీ జ్యువెలరీ సంస్థ బ్రాంచ్‌కు వెళ్లి ఆ షాప్‌ను ఒకరోజంతా మూయించేశాడట. ఒక్కడే ఆ షాప్‌లో కూర్చుని తనకు కావాల్సిన ఉంగరాన్ని సెలెక్ట్ చేశాడట. మరో రెండు, మూడు రోజుల్లో ప్రియాంక తన పెళ్లి గురించి బహిరంగ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.













