Priyanka Chopra: జామకాయలు అమ్మే ఆవిడను చూసి ఇన్స్పైర్ అయిన ప్రియాంక చోప్రా
రాజమౌళి(Rajamouli)- మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29(SSMB29)లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిదే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజాగా ఒడిశా షెడ్యూల్ ను ఫినిష్ చేసుకుంది.
షెడ్యూల్ పూర్తవడంతో ప్రియాంక న్యూయార్క్ కు వెళ్లిపోయింది. అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో కొన్ని ఫోటోలు, వీడియోలతో పాటూ ఒక సెల్ఫీ వీడియోను కూడా ప్రియాంక షేర్ చేసింది. ఆ వీడియోలో ప్రియాంక తనను ఇన్స్పైర్ చేసిన ఒక అంశాన్ని షేర్ చేసుకుంది.
విశాఖపట్టణం ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో తనకు జామకాయలమ్మే ఆవిడ కనిపించిందని, తనకు పచ్చి జామకాయలంటే ఎంతో ఇష్టమని, కారు ఆపి కొనుక్కుందామని ఎంతని అడిగితే రూ.150 అని చెప్పిందని, తాను రూ.200 ఇచ్చి చిల్లర ఉంచుకోమంటే ఆమె తన దగ్గర చిల్లర లేకపోవడంతో తనకు ఇంకొన్ని కాయలు ఇచ్చిందని, వర్కింగ్ ఉమెన్ ఎప్పుడూ ఛారిటీని కోరుకోరని ప్రియాంక చెప్పుకొచ్చింది. ప్రియాంక షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.













