ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం
నిలువెత్తు అందాన్ని పోతపోస్తే ప్రియాంక చోప్రా అనేంత అందంగా ఉంటుందంటారు ఆమె అభిమానులు. ఇప్పుడు అంత అందమైన రూపాన్నీ మైనపు విగ్రహంగా మలిచారు. న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రియాకం చోప్రా మైనపు విగ్రహం కొలువుతీరింది. ఈ బొమ్మకు ప్రియాంక చోప్రా జోనాస్ అనే పేరు పెట్టారు. 2016లో ఎమ్మీ పురస్కారాల వేడుకల్లో ఎర్రరంగు డ్రెస్ ధరించి సందడి చేసిందామో. ఇప్పుడు ప్రియాంక మైనపు బొమ్మకూ అలాంటి డ్రెస్సే వేశారు.
ప్రియాంకకు మరో అరుదైన గరవం దక్కింది. ప్రియాంక మైపు విగ్రహాన్ని న్యూయార్క్‌తో పాటు యూకే, ఆస్ట్రేలియా, ఆసియాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు ఒకే వ్యక్తికి చెందిన విగ్రహం నాలుగు వేర్వేరు మ్యూజియాల్లో పెట్టడం ఇదే తొలిసారి. గతంలో అమెరికన్ గాయని విట్నే ఎలిజిబెత్ హూస్టన్‌కు అత్యధికంగా మూడు విగ్రహాలు పెట్టారు. ఇప్పుడు ఆ రికార్డుని ప్రియాంక బ్రేక్ చేసింది. తన మైనపు బొమ్మతో ఫొటోలకు పోజులిచ్చి సామాజిక మాధ్యమాల్లో పంచుకొంది ప్రియాంక.













