న్యూయర్క్ లో ప్రియాంక ప్రీ వెడ్డింగ్ వేడుకలు!
గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా ఇంటి పెళ్లి సందడి మొదలైంది. త్వరలో ఆమె ఓ ఇంటివారు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. కాగా న్యూయార్క్‌లోని ప్రియాంక ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైపోయాయి. ప్రియాంక ఇల్లు స్నేహితులు, బంధువులతో సందడిగా మారింది. బ్రైడ్ అని పూలతో డిజైన్ చేసిన అలంకరణ ఫొటోను ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుక నిమిత్తం ప్రియాంక తెల్లటి గౌనును ధరించారు. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్లో వీరి వివాహం డిసెంబర్లో జరగనున్నట్లు తెలుస్తోంది. వేడుకకు 200 మంది అతిథులు హాజరుకాబోతున్నారట. ఆ తర్వాత లాస్ఏంజెల్స్, ముంబయిలో ఘనంగా వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు.













