SSMB29: ప్రియాంక పాత్ర అలా ఉండబోతుందా?
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రాజమౌళి(Rajamouli) తన తర్వాతి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని వారాల కిందటే మొదలైంది. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తోన్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది.
ఈ సినిమాలో నానా పటేకర్(Nana Patekar) కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఇప్పటిదాకా ఆయన ఫలానా పాత్ర చేయబోతున్నాడని చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ వచ్చింది రాలేదు. ఇదిలా ఉంటే ఈ వీకెండ్ లో మొదలు కానున్న ఎస్ఎస్ఎంబీ29(SSMB29) కొత్త షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాత్రలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాడట రాజమౌళి.
అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ను రాజమౌళి చాలా ఆసక్తికరంగా మలిచాడని, ఆ పాత్రకు కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే రాజమౌళి మాస్టర్ మైండ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలేమీ ఇంకా బయటకు రాలేదు.













