నన్ను బ్లాక్ క్యాట్ అని పిలిచేవారు..! ప్రియాంక చోప్రా
బాడీ షేమింగ్ నేటి సమాజంలో కామన్ అయిపొయింది. కలర్ కి , పర్సనాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఒక కారణం. అమీర్ ఖాన్ కుమార్తె నుండి షారుఖ్ ఖాన్ కుమార్తె వరకు ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు అంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు ప్రపంచ సుందరిలకు కూడా ఈ కష్టాలు తప్పలేదు.
గొప్ప ప్రతిభ, అందచందాలతో కిరీటాలు గెలుచుకున్న మాజీ సుందరిలు ప్రియాంక చోప్రా, సుష్మిత సేన్ లు సైతం ఈ కామెంట్స్ భారిన పడినవాళ్ళే. ఈ ఇద్దరు సుందరీమణులు పురుషాధిక్యాన్ని ఎదురుకుంటూ, ప్రపంచాన్ని సవాలు చేస్తూ కెరీర్ పరంగా ఎదిగిన గొప్ప నటీమణులు. వ్యక్తిత్వంలో శిఖరం ఎత్తు.
నిర్భయ వైఖరితో ‘ మీ-టూ ‘ వేదికగా చేసుకుని తన బలమైన గొంతును వినిపించిన గ్లోబల్ ఐకాన్ గా ప్రియాంక చోప్రా చాలా మందికి స్ఫూర్తిని ఇచ్చారు. ఈ ప్రపంచ సుందరి తరచుగా పుషాధిక్యత, బాడీ షేమింగ్, జాత్యాహంకారం వంటి సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడుతుంది.
రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ, తన రంగు కారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో బాడీ షేమింగ్ కి గురయ్యానని అప్పటి సంగతులు గుర్తు చేసుకుంది. అందరూ గోధుమ రంగు లేదా నలుపు రంగుని కలిగి ఉండే ఇండియాలో నన్ను ” నల్ల పిల్లి ” , ” డస్కీ ” అని సంబోధించడం జరిగింది. నేను మోస్ట్ టాలెంటెడ్ అని ప్రజలు, ప్రేక్షకులు నమ్మినా కానీ కెరీర్ లో చాలా కష్టపడాల్సి వచ్చిందని, నా బాడీ కలర్ అందంగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డానని ప్రియాంక చెప్పారు.
ఈ ఏడాది బీసీసీ ‘ 100 మహిళలు ‘ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్న నలుగురు భారతీయుల్లో ప్రియాంక చోప్రా ఒకరు. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ లో ఈ విషయాలన్నీ ముచ్చటించారు. బంగారు రంగులో మిళమిళ మెరిసే కలర్ తనకు లేదని, బాలీవుడ్ లో ఎప్పుడు తన ప్రతిభకి తగిన పారితోషికం లభించలేదని ఆవిడ అన్నారు.













