ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు
గొప్పలు చెప్పుకోవడానికి కాదు మనలో ఉనన లోపాలను ఒప్పుకోవడానికి నిజంగా ధైర్యం కావాలి. ఈ విషయంలో ప్రియాంకా చోప్రా ముందు వరసలోనే ఉన్నారు. నేను ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నా అని సూటిగా చెప్పేశారు. ఆస్తమా వ్యాది గ్రస్తుల కోసం ఓ సంస్థ కోరిన మీదట వారిలో ధైర్యం నింపే విధంగా మాట్లాడారు ప్రియాంక. నాకు బాగా దగ్గరగా ఉన్నవారికి నేను ఆస్తమా పేషంట్ అని తెలుసు. ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆస్తమా నన్ను కంట్రోల్ చేయడానికి ముందే నేనూ ఆస్తమాను కంట్రోల్ చేయగలనని నమ్మాను. ఆస్తమా ఉందని అధైర్యపడలేదు. నా గోల్‌ను సాధించుకోవడంలో బెదరలేదు అని చెప్పుకొచ్చారు ప్రియాంకా చోప్రా.













