Priyanka Chopra: విజయ్ సినిమాను రిజెక్ట్ చేసిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా చలామణి అవుతున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రియాంక, సింగర్ నిక్ జోనాస్(Nick Jonas) ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ అక్కడే సెటిలైపోయింది. ప్రస్తుతం రాజమౌళి(Rajamouli)-మహేష్(
రీసెంట్ గా ప్రియాంక తల్లి మధు చోప్రా తన కూతురి గురించి పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ప్రియాంక, విజయ్(Vijay) తో కలిసి తమిజాన్(Thamizhan) సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు మొదట ప్రియాంకను అడిగినప్పుడు ప్రియాంక నో చెప్పినట్టు మధు చోప్రా(Madhu Chopra) వెల్లడించారు.
కానీ తర్వాత మేకర్స్ ప్రియాంక తండ్రిని వచ్చి అడిగారని, సమ్మర్ సెలవుల్లో రెండు నెలలైనా తమ సినిమాకు డేట్స్ కేటాయించమని కోరారని, దాంతో ప్రియాంక తండ్రి ఒప్పుకున్నారని, తండ్రి మాట కాదనలేక ప్రియాంక ఆ సినిమా చేసినట్టు ఆమె తెలిపారు. అయితే ప్రియాంకకు మాత్రం విజయ్ ఎంతో ఎంతో అభిమానం, గౌరవమని, ఆ సినిమా టైమ్ లో విజయ్ ప్రియాంకకు ఎంతో హెల్ప్ చేశాడని ఆమె తెలిపారు.













