నేను భారతదేశ ప్రధాని… నా భర్త అమెరికా అధ్యక్షుడు
సినీరంగంలో విజయవంతంగా రాణిస్తూనే, ఆరోగ్యం, విద్య, మహిళల హక్కులపై ప్రచారంలో ముందుంటున్న ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. తాను భారతదేశ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె చెప్పారు. తన భర్త నిక్ జోనస్‌ను అమెరికా అధ్యక్షుడిగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలకు సంబంధించిన విషయాలు నాకు ఇష్టం ఉండదు. కానీ మేమిద్దరం మార్పు తేవాలనుకుంటున్నాం. ఏదీ అసాధ్యం కాదు అని ద సండే టైమ్స్‌తో చోప్రా వ్యాఖ్యానించారు. తన భర్త గొప్ప నాయకుడు కాగలరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.













