డిసెంబర్ 4న ప్రియాంక రిసెప్షన్
ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ వివాహానికి జోద్‌పూర్‌లోని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివాహం తర్వాత ఢిల్లీలో రిసెప్షన్ ఉండనుంది. దీనికి ప్రియాంక కుటుంబ సభ్యులు, ఆమె స్నేహితులు, సంజయ్‌లీలా భన్సాలీ, ఆలియా భట్, రణ్వీర్ కపూర్ వంటి వారు దీనికి హాజరుకానున్నారు. వీరి వివాహానికి దుస్తులను జైపూర్ చెందిన పునిత్ బలానా, అబు జైని సందీప్ ఖోసల్ డిజైన్ చేస్తున్నారు. డిసెంబర్ ఒకటో తేదీన భారతీయ సంప్రదాయ పద్ధతిలోనూ, మూడో తేదీన నిక్ జొనాస్ కుటుంబానికి సంబంధించిన పద్ధతిలోనూ వీరి వివాహం జరగనుంది. ఆ తర్వాతి రోజు ఢిల్లీలో వివాహం రిసెప్షన్ ఉండనుంది.













