Priyanka Chopra: యాక్షన్ పాత్రలంటేనే ఇష్టం

పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలై అక్కడే హాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది ప్రియాంక చోప్రా(Priyanka chopra). ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా రీసెంట్ గా హెడ్స్ ఆఫ్ స్టేట్(Heads of state) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి ఏజెంట్ నోయెల్ పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. రీసెంట్ గా ప్రియాంక ఓ ఇంటర్య్వూలో పాల్గొని ఆ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
హెడ్స్ ఆఫ్ స్టేట్ డైరెక్టర్ తనకు ఫస్ట్ టైమ్ కథ చెప్పినప్పుడే ఆ సినిమాలో భాగమవ్వాలనుకున్నానని, యాక్షన్ మూవీకి హీరోయిన్ ను లీడ్ రోల్ లో అనుకోవడమే అందుకు ప్రధాన కారణమని, మామూలుగా ఇలాంటి క్యారెక్టర్లను ఎక్కువగా హీరోల కోసం రాస్తుంటారు కానీ డైరెక్టర్ ఇల్యా నైషుల్లర్(Ilya Naishuller) హీరోయిన్ తో ఈ సినిమాను చేయాలనుకోవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ప్రియాంక తెలిపింది.
ఇండస్ట్రీలో ఎక్కువగా అందరూ అందానికే ప్రాధాన్యమిస్తారు కానీ తాను మాత్రం గ్లామర్ పాత్ర కంటే యాక్షన్ పాత్రలు చేయడానికే ఆసక్తి చూపిస్తానని, కెరీర్ మొదటి నుంచి కూడా తనకు ఆ తరహా పాత్రలు చేయడంపైనే ఆసక్తి ఉండేదని, ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న తాను ఇండియాను, హిందీ సినిమాలను చాలా మిస్ అవుతున్నానని, కొన్ని సార్లు సొంత ఇంటికి దూరమయ్యాననే ఫీలింగ్ కూడా వస్తుందని ప్రియాంక చెప్పింది.