త్వరలో ప్రియాంక చోప్రా పెళ్లి?
ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జొనాస్ జంట కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. తన బాలీవుడ్ సినిమా భారత్ కారణంగా కూడా ప్రియాంక వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్టర్ వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంకను ఎంపిక చేశారు. కానీ ప్రియాంక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె చిత్రబృందానికి తెలిపారు. దీని గురించి అలీ అబ్బాస్ ట్వీట్ చేశారు. ప్రియాంక భారత్ నుంచి తప్పుకున్నారు. దీనికొక ప్రత్యేక కారణం ఉంది. షూటింగ్కు ఒక్కరోజు ముందు ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె తీసుకున్న నిర్ణయం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. భారత్ నుంచి ప్రియాంకకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
తాజాగా ఓ కథనం ప్రకారం, ప్రియాంక, నిక్కి జొనాస్ జంటలకు ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయిందట. వారం క్రితం ప్రియాంక 36వ బర్త్ డే లండన్లో జరిగింది. అదే రోజు ఆమె ఎంగేజ్మెంట్ జరిగిందని అక్కడి పాపులర్ వెబ్సైట్ కథనం. జొనాస్(25), ప్రియాంక(36) ఇద్దరూ 2017లో జరిగిన ఓ ఈవెంట్లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. ఇరు కుటుంబాలూ కలుసున్నాక వీరి బంధం సీరియస్ టర్న్ తీసుకుంది. వీరి ప్రేమ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతోంది.













