ప్రియాంక చోప్రాకు ఇది బోనస్
సోషల్ మీడియాలో సుమారు 45 మిలియన్ల ఫాలోవర్స్ కలిగిన ప్రియాంక చోప్రా అందులో ప్రొడక్ట్స్ ప్రమోషన్ కోసం ఒక్కో పోస్ట్‌కి కోటి ఎనభై లక్షలు ఛార్జ్ చేస్తున్నదని తెలుస్తోంది. అంటే సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా సంపాదించే కోట్లాది రూపాయలకు ఇది బోనస్ అన్నమాట. ప్రియాంక చోప్రా తరువాత విరాట్ కోహ్లి ఒక్కో పోస్ట్‌కి కోటి ముప్పయి లక్షలు వసూలు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియాంక తాజాగా నటించిన హాలీవుడ్ చిత్రం దిస్కై ఈజ్ ది పింక్ చిత్రానికి మంచి రివ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.













