దీపికను దాటేసిన ప్రియాంక
హాలీవుడ్లో సత్తా చాటుతున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. హాలీవుడ్లో ప్రవేశించిన తర్వాత ఈ భామకు ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇన్ స్టాగ్రామ్‌లో ఆమె ఎప్పుడో పాతిక మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను దాటేసింది. అంటే రెండున్న కోట్ల మంది నెటిజన్లు ఆమెకు ఫాలోవర్లుగా ఉన్నారు. అయితే స్టార్ బ్యూటీ దీపికా పదుకునేకు కూడా ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని నెలల క్రితం వరకు దీపికనే మొదటి స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు దీపికను ప్రియాంక దాటేసింది. దీపికకు 25.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా ప్రియాంకకు ఇప్పుడు 26.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. దీంతో అత్యధిక సంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు ఉన్న ఇండియన్ లేడీ స్టార్‌గా ప్రియాంక నిలిచింది. ఉన్నట్టుండి ఇంత ఫాలోయింగ్ ఎలా పెరిగింది అంటే, దానికి కారణం నిక్ జోనాస్‌తో ప్రేమాయాణం, ఆ తర్వాత జరిగిన నిశ్చితార్థమే. తరచుగా ప్రియాంక వార్తల్లో నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమెకు ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగింది.













