Priyanka Chopra: భర్తను మిస్ అవుతున్న ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైన గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా(priyanka chopra) రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక టాలీవుడ్ లో నటిస్తున్న సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్ హైదరాబాద్ లో జరగ్గా, ఆ ఈవెంట్ కోసం గ్లోబల్ బ్యూటీ హైదరాబాద్ కు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ప్రియాంక తన భర్త నిక్ జోనాస్(nick jonas) ను మిస్ అవుతున్నట్టు చెప్పింది.
అయితే ప్రియాంక తన భర్తను మిస్ అవడానికి గల కారణం, తన సినిమా ఈవెంట్ కాదు. ఆమె నిక్ ను మిస్ అవుతున్నానని చెప్పిన కారణం చాలా ముద్దుగా ఉంది. తాజాగా జరిగిన వారణాసి(varanasi) ఈవెంట్ కు ప్రియాంక అందంగా, దేశీ గర్ల్ అవతారంలో రాగా, ఈవెంట్ తర్వాత నత హెయిర్ ను సెట్ చేసుకుంటూ సడెన్ గా తన భర్తను గుర్తు చేసుకుంటూ ఓ వీడియో క్లిప్ ను ఇన్స్టా లో షేర్ చేసింది.
ఈ వీడియోలో ప్రియాం తన హెయిర్ ను విప్పడానికి ట్రై చేస్తున్నానని, ఇవాళ ఎవరు ఈ పని చేస్తున్నారా అంటూ వెంటనే హాయ్ ఖుష్బూ(Kushboo) అని హెయిర్ డ్రెస్సర్ తో కలిసి పీసీ నవ్వుతూ తన హెయిర్ ను విప్పడానికి తనకు ఎప్పుడూ హెల్ప్ అవసరమవుతుందని, ఈ సందర్భంగా తన భర్త నిక్ జోనాస్ ను మిస్ అవుతున్నట్టు క్యాప్షన్ పెడుతూ, తన హెయిర్ డ్రెస్సర్ ఖుష్బూ కి థాంక్స్ చెప్పింది పీసీ.
https://www.instagram.com/stories/priyankachopra/3766665687130041965/?hl=en






