టొరంటో ఫిల్మ్ ఫెస్ట్ రాయబారిగా ప్రియాంక చోప్రా
టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి రాయబారిగా ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు ఆహ్వానం అందింది. ఈమెతో పాటు బాలీవుడ్ నుంచి నిర్మాత అనురాగ్ కశ్వప్ కు కూడా రాయబారిగా ఉండాలంటూ టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నిర్వాహకులు ఆహ్వానం పంపారు. సెప్టెంబర్ 10 నుంచి 19 వరకు 45 వ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనున్నది. నా కెరీర్ మొత్తంలో ఐఎఫ్టీఐఎఫ్ఎఫ్-ఎన్ఈటీ రెండవ నివాసంగా ఉన్నది. నటి, నిర్మాతగా ఈ చిత్రోత్సవంతో నాకెంతో అనుబంధం ఉన్నది అని ప్రియాంక టీఐఎఫ్ఎఫ్ తో తన ప్రయాణ క్షణాలతో ఒక వీడియోను ట్వీట్ చేసింది. ఈ ఏడాది కూడా రాయబారిగా తనను ఆహ్వానించినందుకు చాలా గర్వపడుతున్నానని, ఎంతో విలువైన సంబంధాన్ని కొనసాగించాలని ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.













