పెళ్లి కూతురు రూల్స్ బ్రేక్ చేసిన ప్రియాంక
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రియుడు నిక్ జోనస్‌ను వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంకను అమెరికాలో పెళ్లికూతురును చేశారు. ఈ వేడుక చాలా వైభవంగా జరిగింది. ప్రియాంక చోప్రా కుటుంబ సభ్యులు, స్నేహితులు నిక్ కుటుంబ సభ్యులు అంత కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియాంక చోప్రా తన ఆనందాన్ని అభిమానుతో పంచుకుంది. కాసేపు ప్రేమ ఆనందంతో మంది నిండిపోయిన సందర్భంలో అద్భుతమైన వ్యక్తులతో కలిసి వేడుక చేసుకున్నాం. పెళ్లి కూతురు రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి మరి పుల్గా ఎంజాయ్ చేశాం. ఇలాంటి వేడుకతో నన్ను సర్ప్రైజ్ చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన పార్టీ ఉంటుందని భావించలేదు. రూల్స్ పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు కూడ పార్టీని ఎంజాయ్ చేసిన తీరు ఎప్పటికీ మర్చిపోలేను. అంటూ ప్రియాంక తన సంతోషాన్ని ఇన్స్టాల్ షేర్ చేసుకుంది. కాగా నిక్ ది అమెరికా కనుక పెళ్లి వేడుకలు అక్కడ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.













