త్వరలో ప్రియాంక నిశ్చితార్థం?
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ప్రేమ కథే ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్. ఇప్పటి వరకూ విదేశాల్లోనే సాగిన వీళ్ల ప్రేమ కథ ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది. కొన్ని రోజుల కిత్రం నిక్‌ను వెంటపెట్టుకుని ముంబయిలో దిగిపోయింది ప్రియాంక. కొంతమంది స్నేహితులను, కుటుంబ సభ్యులను విందుకు పిలిచి నిక్‌ను పరిచయం కూడా చేసేసిందట. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్లో వైరల్ అయ్యాయి. నిక్‌ను తన కుటుంబానికి పరిచయం చేయడానికి ప్రియాంక ఇండియాకు తీసుకొచ్చిందంటూ వార్తలొచ్చాయి. కానీ వేటిపైనా ప్రియాంక స్పందించలేదు. నిక్ గురించి ప్రియాంక తల్లి వద్ద కొందరు ప్రస్తావించగా, ఇప్పుడే కదా పరిచయం అయ్యాడు. అప్పుడే ఓ అంచనాకు ఎలా రాగలం అంటూ నర్మగర్భంగా మాట్లాడినట్టు సమాచారం. కానీ జులై చివరకు కానీ ఆగస్టులో కానీ ప్రియాంక, నిక్‌ల నిశ్చితార్థం జరగబోతున్నట్లు సమాచారం. హాలీవుడ్ టు బాలీవుడ్ ప్రయాణిస్తున్న ప్రియాంకకు ఈ ట్రిప్పులోనే నిక్‌తో నిశ్చితార్థం ఖాయం చేసి కొన్ని నెలల తర్వాత పెళ్లి పెట్టుకొనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని సమాచారం. నిశ్చితార్థంపై ప్రియాంక అధికారికంగా మాట్లాడటమే మిగిలి ఉంది.













