ప్రియుడితో కలిసి మరోసారి దొరికిన ప్రియాంక చోప్రా
గ్లోబల్ భామ ప్రియాంక చోప్రా కొన్నాళ్ళుగా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో చెట్టాపట్టాలు వేస్తున్న సంగతి తెలిసిందే. వెక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళుతున్నారు. ఆ మధ్య ఓ బేస్‌బాల్ గేమ్‌ను కలిసి వెళ్ళిన వారు రీసెంట్గా లాస్ ఏంజిల్స్‌లోని వెస్ట్ హాలీవుడ్లో ఉన్న టోకా మెడెరాలో డిన్నర్ డేట్‌కు వెళ్లారు. బేస్‌బాల్ గేమ్‌కు కలిసి వచ్చినప్పుడే ఈ ఇద్దరి మధ్యే ఏదో నడుస్తున్నదన్న పుకార్లు వచ్చాయి. ఇక డిన్నర్‌కు వెళ్లడంతో ఆ రూమర్లు నిజమేనని అన్నారు. అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా తాజాగా అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రియుడితో కలిసి మరోసారి కెమెరా కంటికి చిక్కారు. ఏదో సీరియస్ డిస్కషన్ చేస్తూ నడుచుకుంటూ వెళుతున్న వీరిద్దరిని కెమెరాలో బంధించారు ఫోటోగ్రాఫర్స్. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరి మద్య తప్పక ఎఫైర్ ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు కలిసి ఓ సినిమా ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించనున్నారట. హాలీవుడ్లో పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ప్రియాంక త్వరలో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.













