ప్రియుడితో కలిసి బర్త్ డే జరుపుకున్న ప్రియాంక
గ్లోబల్ భామ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ త్వరలో పెళ్లి పీటలు ఎ్కనున్నారని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నా దీనిపై క్లారిటీ రావడం లేదు. ప్రియాంక, నిక్‌లు ఈ మధ్య ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లడంతో జనాలలో అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా ఈ జంట మరోసారి కెమెరా కంటికి చిక్కడం హాట్ టాపిక్‌గా మారింది. జులై 18న ప్రియాంక తన 36వ పుట్టిన రోజు జరుపుకుంటుంది.
ఈ క్రమంలో నిక్, ప్రియాంక బర్త్‌డేకి సంబంధించి ఏర్పాట్లు చేశాడట. లండన్‌లోని చిల్టర్న్ ఫైర్ హౌజ్ రెస్టారెంట్లో పుట్టిన రోజు వేడుకలని జరుపుకున్నట్టు తెలుస్తుంది. ముందు రోజే ఇద్దరు కలిసి లంచ్, డిన్నర్‌కి వెళ్లడంతో ఫోటోగ్రాఫర్స్ వీరిని తమ కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం ఈ క్రేజీ కపుల్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రియాంక బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ రిపోర్టర్ నిక్, ప్రియాంక వివాహ పుకార్లు గురించి సీనియర్ చోప్రాని అడిగినప్పుడు, మీరు ఆ విషయం నిజమని నమ్ముతున్నారా. మీరు చెబితే మేము సీరియస్‌గా తీసుకుంటామని మదు చోప్రా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.













