ప్రియాంక- నిక్ నివాసం ఎక్కడో తెలుసా?
దేశీగార్ల్ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమైద్ భవన్లో వివాహం చేసుకోనున్నారని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో జరగనున్న వీరి వివాహానికి కేవలం 200 మంది అతిధులు హాజరు కానున్నారట. అయితే పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి ఉండే విల్లాకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. లాస్ ఏంజెల్స్‌లోని బెవర్లీ హిల్స్ ప్రాంగణంలో నిక్ జోనాస్ కొన్ని నెలల క్రితం 6.5 మిలియన్ డాలర్స్ (సుమారు 48 కోట్ల)తో విల్లా కొన్నాడట. 4,129 చదరపు అడుగులలో ఉండే ఈ విల్లాలో అన్గేటెడ్ స్విమ్మింగ్ పూల్, ఐదు పడకగదులు, అతిథి వింగ్ నాలుగు బాత్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ విశేషమేమంటే నిక్.. ప్రియాంకని ప్రపోజ్ చేసింది ఇదే స్థలమట. ఈ ఇంటిని ఇంటర్నేషనల్ వాస్తు శిల్పులతో అందంగా తయారు చేయించాడట నిక్. ఈ విల్లాలో గాజుతో తయారు చేయబడిన గోడలు, కృత్రిమ ప్రెస్టరీ పైకప్పు ఉన్నాయి. ఎంతో అందంగా ఉన్న విల్లాని చూసి అభిమానులు చాలా థ్రిల్ అవుతున్నారు. ఆగస్టులో ప్రియాంక, నిక్ భారతీయ సంప్రదాయం ప్రకారం ముంబయిలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.













