థ్యాంక్స్ గివింగ్ వేడుకలో ప్రియాంక, నిక్
గ్లోబర్‌స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌ల పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి., వచ్చే నెల 2న ప్రియాంక చోప్రా, నిక్‌జోనాస్‌ను వివాహమాడబోతోంది. రాజాస్థాన్ జోధ్‌పూర్‌లోని ఉమైద్భవన్ పెళ్లికి వేదికైంది. 29 నుంచి పెళ్లి వేడుకలు మొదలుకానున్నాయి. ఇప్పటికే వెడ్డింగ్ గిఫ్ట్ రిజిస్ట్రీకి ప్రియాకం శ్రీకారం చుట్టారు. తాజాగా ఢిల్లీలో థ్యాంక్స్ గివింగ్ వేడుకను కూడా నిర్వహించారు. ఇటీవల ఇండియాకు వచ్చిన నిక్, ప్రియాంక కుటుంబంతో పాటు థ్యాంక్స్ గివింగ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఇరవైకు పైగా ప్రియాంక తరపు బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందరు కలిసి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని భోజనం చేస్తున్న ఫొటోను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేశారు. హ్యాపీ థ్యాంక్స్ గివింగ్… ఫ్యామిలీ ఫరెవర్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.













