పెళ్లి ఖర్చు ఓ రేంజ్ లో…
ఎప్పుడెప్పుడా అనుకొంటున్న ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ల పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 2న క్రిస్టియన్ పద్ధతిలో, ఆ మర్నాడు హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరి పెళ్లి జరుగుతుంది. రాజస్థాన్ జోద్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లోని గదులన్నీ ప్రియాంక పెళ్లి కోసం ఐదు రోజుల పాటు బుక్ చేశారు. మొహంది, సంగీత తదితర కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయట. ప్రియాంక చోప్రా, ఆమె తల్లి కుటుంబ సభ్యులు జోద్పూర్ ఎయిర్‌పోర్టు నుండి తాజ్ ఉమైద్ భవన్ ప్యాలెస్‌కు హెలికాప్టర్లో చేరుకొంటారు. ఉమైద్ ప్యాలెస్‌లో విడిది అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే అటు ప్రియాంక, ఇటు నిక్ జోనాస్ ఇద్దరూ ప్రముఖులు కావడంతో ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు. ప్యాలెస్‌లోని రూమ్స్ కోసమే దాదాపు మూడున్నర కోట్లు ఖర్చు పెడుతున్నారట. క్యాటరింగ్ ఖర్చులు మనిషికి 18 వేలు అవుతాయంటే ఈ పెళ్లి ఏ రేంజ్లో జరుగుతుంతో ఊహించుకోవచ్చు.













