పాప్ సింగర్ తో ప్రియాంక ప్రేమాయణం?
ప్రియాంక చోప్రా ప్రేమలో పడిందా? అంటే ఔననే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. క్యాంటికో సిరీస్‌తో అంతర్జాతీయ నటిగా మారిపోయింది ఈ సొగసరి. ఈ సిరీస్‌తో పలు హాలీవుడ్ అవకాశాలు ఆమెకు వరిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్‌సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడినట్లు తెలిసింది. గతకొంతకాలంగా వారిద్దరు డేటింగ్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది మెట్గలా వేడుకలో జోనస్‌తో ప్రియాంకకు పరిచయం ఏర్పడిందని, ఆ స్నేహం కొద్ది రోజుల్లోనే ప్రణయానికి దారితీసినట్లు తెలిసింది. వారాంతాల్లో పలు వేడుకలు, పార్టీలకు ఈ జంట కలిసి హాజరవుతుండటంతో ప్రియాంక జోనస్‌తో ప్రేమలో పడింది నిజమేనంటున్నారు. బోటు షికారులో నిక్‌తో ప్రియాంక సన్నిహితంగా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రియాంక చోప్రా కంటే జోనస్ పదేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. ప్రియాంక వయసు 35 అయితే జోనస్‌కు 25 ఏళ్లే. ప్రియాంక, జోనస్లా ప్రేమయాణం హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వర్గాల్లో హాట్‌టాపిక్ మారింది. ప్రియాంక మాత్రం ఈ ప్రేమాయణంపై స్పందించలేదు. తామిద్దరం మంచి స్నేహితులమని చెబుతున్నది.













