న్యూయార్క్ వీధుల్లో నిక్కీ, ప్రియాంక హల్ చల్
ప్రియాంక చోప్రా, గీత రచయిత, గాయకుడు నిక్కీ జోనస్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇది అబద్ధమని కానీ, తామిద్దరం స్నేహితులమని కానీ వీరిలో ఎవరూ పేర్కొనలేదు. ఎక్కడకెళ్లినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ప్రస్తుతం సైకిళ్లపై న్యూయార్క్ వీధుల్లో విహరిస్తున్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. మొదటిసారిగా వీరిద్దరూ నిక్కీ కుటుంబంలో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారు. అప్పటి నుంచి వీరి సంబంధంపై చర్చ మొదలైంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నారని పత్రికలు కథనాలు రాశాయి. తర్వాత ప్రియాంక తల్లి తన కుమార్తె విదేశీయుడ్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించనని చెప్పింది. ఈ తర్వాత ఇరు కుటుంబాలు వారు గోవా వెళ్లారు. ఆకాష్ అంబాని ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు. ఇప్పుడు న్యూయార్క్ వీధుల్లో ఇలా విహరిస్తున్నారు.













