క్రేజీ ఆఫర్ కొట్టేసిన ప్రియాంక
గ్యాంగ్ లీడర్(Gang Leader) సినిమాతో ఆరేళ్ల కిందట టాలీవుడ్(Tollywood) డెబ్యూ చేసిన ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) కు ఆ తర్వాత శ్రీకారం సినిమాలో ఛాన్సొచ్చింది. కానీ రెండు సినిమాలూ పెద్దగా ఆడకపోవడంతో అమ్మడికి తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్(kollywood) కు వెళ్లి అక్కడ సెటిలైపోయింది ప్రియాంక. అక్కడ డాక్టర్(Doctor), డాన్(Don) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది.
తర్వాత సూర్య(suriya) సరసన నటించాక కెరీర్ ఊపందుకుంది. కెప్టెన్ మిల్లర్(Captain Miller) లో డిఫరెంట్ పాత్ర దక్కింది కానీ తమిళంలోనే ఏవరేజ్ గా మిగిలింది. కానీ రెండోసారి నానితో నటించిన సరిపోదా శనివారం(Saripodaa Sanivaram) మాత్రం అమ్మడికి బ్లాక్ బస్టర్ ను అందించింది. ఈ సినిమాను నిర్మించిన డీవీవీ బ్యానర్(DVV Entertainments) లోనే ప్రియాంక ఓజీ(OG) సినిమా చేస్తోంది. కాకపోతే అది రిలీజవడానికి టైమ్ పట్టేలా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక, విశ్వక్ సేన్(Viswaksen) సరసన ఓ సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. జాతిరత్నాలు(Jathiratnalu) ఫేమ్ అనుదీప్(Anudeep) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. విశ్వక్ తన సినిమాల కోసం ఫామ్ లో ఉన్న హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని సమాచారం.













