Priyanka Arul Mohan: పవన్ తో వర్క్ చేయడం నా అదృష్టం

పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్(priyanka Arul Mohan) హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఓజి(OG). సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) బ్యానర్ లో డీవీవీ దానయ్య(DVV Danayya) భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ(Imran hashmi) విలన్ గా నటించిన ఓజి సినిమాకు తమన్(thaman) సంగీతం అందించగా సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ కు మరో 8 రోజులే ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలిస్తూ సినిమా గురించి, పవన్ తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి పలు విషయాలను షేర్ చేసుకుంది. పవన్ తో కలిసి నటంచడం ప్రతీ రోజూ తన అదృష్టంగానే భావిస్తానని ప్రియాంక చెప్పుకొచ్చింది.
ఓజి సినిమాను అందరూ యాక్షన్ మూవీ అనుకుంటున్నారని, అందులో ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుందని, దాని చుట్టూ యాక్షన్ ఉంటుందని, ఓజాస్ జీవితాన్ని మలుపు తిప్పే పాత్రలో తాను కనిపిస్తానని చెప్పింది ప్రియాంక. ఈ మూవీ కోసం రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తున్నానని, ఎలక్షన్స్ కు ముందు ఎప్పుడు చూసినా పవన్ ఏదొకటి ఆలోచిస్తూ ఉండేవారని, గెలిచాక ఆయన ప్రశాంతంగా, మరింత బాధ్యతగా కనిపిస్తున్నారని, ఇప్పుడు కాస్త నవ్వుతున్నారని, ఆయన రీల్ లైఫ్ లోనూ, రియల్ లైఫ్ లోనూ హీరోనే అని చెప్పుకొచ్చింది ప్రియాంక.