సిరివెన్నెల ఫస్ట్ లుక్ విడుదల
ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న ప్రియమణి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. అయితే సిరివెన్నెల అనే తెలుగు చిత్రంలో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేశారు. ఆ తర్వాత చిక్‌మంగళూర్‌లో షూట్ చేసిన పాటతో చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో ప్రియమణి పవర్‌పుల్ లేడీగా కనిపించింది. ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది.
ఇక ఏఎన్‌బి కో ఆర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ బ్యానర్‌పై కమల్ బోరా, ఏఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు సాయి తేజస్విని, కాలకేయ ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నాం. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి, ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి, ఫైట్స్: రామకృష్ణ, లిరిక్స్: శ్రీరామ్ తపస్వీ.













