‘సిరివెన్నెల’ గా ప్రియమణి
చాన్నాళ్ల తర్వాత తెలుగులో థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాను. సూపర్ నేచురల్కి సంబంధించిన విషయాలు నేర్చుకునే క్రమంలో జరిగిన ఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుంది అని ప్రియమణి అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి సిరివెన్నెల అనే టైటిల్ పెట్టారు. ఏఎన్‌బి కోర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ భాషా, రామసీత నిర్మాతలుగా ప్రశాశ్ పులిజాల ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది.
దర్శకుడు ప్రకాశ్ పులిజాల మాట్లాడుతూ టాకీ పూర్తయ్యింది. రెండు పాటలు మిగిలున్నాయి. కె విశ్వనాథ్‌గారు రూపొందించిన సిరివెన్నెలకూ, మా సినిమాకు ఎక్కడ పొంతన ఉండదు. కానీ మా కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ అని పెట్టాం. ప్రియమణిగారు కొత్త లుక్‌లో కనిపిస్తారు. కాలకేయ ప్రభాకర్ విలన్‌గా నటిస్తున్నారు. మహానటి ఫేమ్ సాయి తేజ మంచి పాత్ర పోషిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇది అని అన్నారు. బిజినెస్‌మేన్‌గా నటిస్తున్నట్టు కాలకేయ ప్రభాకర్ తెలిపారు. నిర్మాత భాష మాట్లాడుతూ నేను కీరవాణిగారి దగ్గర బాహుబలి 2 వరకు మేనేజర్‌గా పనిచేశాను. మా నిర్మాత కమల్‌గారు లేకుంటే ఈ ప్రాజెక్ట్ లేదు. సినిమా చాలా బాగా వస్తోంది అని అన్నారు.













