ప్రియమణి డిమాండ్ అలాంటిది మరి!
నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ప్రియమణికి సరైన హిట్లు లేకపోవడంతో కెరీర్లో టాప్ రేంజ్ కు వెళ్లలేకపోయింది. ఇతర భాషల్లో వచ్చిన ఛాన్సులను అందుకుంటూ అవి చేస్తున్నప్పటికీ అమ్మడికి సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసిందో అప్పటి నుంచి ప్రియమణి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఆ తర్వాత ఆమె నుంచి తెలుగులో ఓటీటీ సినిమాగా వచ్చిన భామా కలాపం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కూడా వస్తోంది. రీసెంట్ గా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన నేరు సినిమాలో లాయర్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక షారుఖ్ ఖాన్ జవాన్ సక్సెస్ నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి.
ప్రియమణి నటిస్తున్న సినిమాలు హిట్ అవడంతో ఆమెకు బాగా ప్లస్ అవుతోంది. త్వరలో రిలీజ్ కాబోతున్న ఆర్టికల్ 370లో కూడా ఓ కీలక పాత్రలో నటించింది ప్రియమణి. కొటేషన్ గ్యాంగ్ అనే తమిళ సినిమాలో కూడా ప్రియమణి కనిపించనుంది. 40 ఏళ్ళ వయసుకు దగ్గరలో ఉండి కూడా ఈ రేంజ్ డిమాండ్ తో రాణించడం అంటే మామూలు విషయం కాదు. థియేట్రికల్ సినిమాలే కాకుండా ఓటీటీ సినిమాల్లో నటించడానికి కూడా ప్రియమణి సై అనడం వల్ల ఆమెకు ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి.













